మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా మహారాష్ట్ర హౌసింగ్ మంత్రి జితేంద్ర సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. మంత్రి సన్నిహితుడికి ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. మంత్రికి కరోనా లక్షణాలు ఏవీ లేవని స్వచ్ఛందంగా హోం క్వారంటైన్‌లో ఉంటున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఐతే గత కొద్దిరోజులుగా మంత్రిని కలిసిన ఆయన బంధువులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
'నేను మా ఇంట్లో సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నది నిజమే. ఆందోళన చెందాల్సిందేమీ లేదు. నా చుట్టూ ఉన్నవాళ్లు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా స్వీయ నిర్బంధంలో ఉంటున్నాని' జితేంద్ర తెలిపారు.