పిల్లలు, బాలింతలు, గర్బిణీలుండే అంగన్‌వాడీ కేంద్రాలు, మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో కరోనా వైరస్ నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా, మహిళా-శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యతో నగరంలోని డీఎస్‌ఎస్ భవనంలో మంత్రి నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మీ పథకం కింద అందించే భోజనాన్ని ఉదయం 9 నుంచి 11 గంటల లోపు వండి వేడివేడిగా తల్లులకు, పిల్లలకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు అంగన్‌వాడీ కేంద్రాలకు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అటువంటి వారిని గుర్తించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందజేయాలన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో అత్యంత శ్రద్ధ తీసుకోవాలి : మంత్రి సత్యవతి