కరోనాని తరిమికొట్టే క్రమంలో ప్రజలలో అవగాహన పెంచేందుకు సెలబ్రిటీలు నడుంకట్టిన విషయం తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విధంగా సేఫ్ హ్యాండ్స్ కార్యక్రమంపై సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు సినీ నటులు. కొందరు చేతులని ఎలా శుభ్రపరచుకోవాలి. క్వారంటైన్‌గా ఉండి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. తాజాగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మ ఇద్దరు కలిసి సందేశాన్ని అందించారు. ఇంట్లోనే క్షేమంగా, ఆరోగ్యంగా ఉండండి. మనం ఇంట్లో ఉంటే కరోనా వ్యాప్తి చెందదు అని విరుష్క దంపతులు పిలుపునిచ్చారు.
విక్టరీ వెంకటేష్ కూడా కరోనాపై అవగాహన కల్పించేలా పోస్ట్ పెట్టారు. ఖచ్చితంగా ఐదు విషయాలని పాటిస్తే కరోనా మన దరికి చేరకుండా ఉంటుందని తెలిపారు. ఇక మహేష్ బాబు భార్య నమ్రత సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌లో భాగంగా ఎలా శుభ్రపరచుకోవాలో వీడియో ద్వారా తెలిపింది.